ఎందుకు చర్యలు తీసుకోలేదు?

ABN , First Publish Date - 2020-12-01T08:24:41+05:30 IST

తమపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సోమవారం రాత్రి నెక్లె్‌సరోడ్డులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేస్తే ఎందుకు చర్య తీసుకోలేదు? అని పోలీసులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి నిలదీశారు. సంజయ్‌, సోమవారం రాత్రి నెక్లె్‌సరోడ్డులో మాజీ రాజ్యసభ సభ్యులు

ఎందుకు చర్యలు తీసుకోలేదు?

కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి 


హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తమపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సోమవారం రాత్రి  నెక్లె్‌సరోడ్డులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేస్తే ఎందుకు చర్య తీసుకోలేదు? అని పోలీసులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి నిలదీశారు.  సంజయ్‌, సోమవారం రాత్రి  నెక్లె్‌సరోడ్డులో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు తదితరులతో కలిసి టీ తాగుతుండగా మజ్లిస్‌ కార్యకర్తలు, స్థానిక కార్పోరేటర్‌ విజయారెడ్డి అడ్డుకున్నారని తెలిపారు.


ఈ ఘటనలో పార్టీ కార్యకర్త వాహనాన్ని ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎ్‌సకు లొంగినట్లుగా పనిచేయవద్దని డీజీపీకి చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణను మరో పశ్చిమ బెంగాల్‌ చేయవద్దని సీఎం కేసీఆర్‌కు విజ్ణప్తి చేశారు. ‘ఇది మంచి సంప్రదాయం కాదు.. ఇలాగే చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు. యావత్‌ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుంది’ అని హెచ్చరించారు.  ఆంధ్ర, రాయలసీమ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని గుర్తించిన టీఆర్‌ఎస్‌ ముఖ్యులు సంజయ్‌ పేరిట దొంగపో్‌స్టలను సోషల్‌మీడియాలో పెట్టించారని ఆరోపించారు.


టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు నుంచే తప్పుడు పోస్ట్‌లు పెట్టిస్తున్నారని పేర్కొంటూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చట్టాన్ని, ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు  ఏ ఒక్క చర్య తీసుకోలేదు. పోలీసులకు సహకరించిన బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని ఆరోపించారు.  టీఆర్‌ఎస్‌ కార్యకర్తల డబ్బును పోలీసులకు పట్టిస్తే, వారే దగ్గరుండి ఇంటింటికీ పంపిణీ చేయించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వందల కోట్లు పంపిణి చేసిందని, ఆరోపించారు.  కాగా  ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పై ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T08:24:41+05:30 IST