సకల ఉద్యోగులతో జేఏసీ..13న చలో అసెంబ్లీ
ABN , First Publish Date - 2020-03-02T10:28:35+05:30 IST
సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యమని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వంపై పోరాడేందుకు

హిమాయత్‌నగర్/హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యమని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వంపై పోరాడేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు కలిసి ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నాడిక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు సదానందగౌడ్, చావ రవి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి 13న అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించారు.