సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2020-08-18T06:52:08+05:30 IST

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు7 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 20

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

  • 20 రోజులపాటు వర్షాకాల సమావేశాల నిర్వహణ
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం


అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు7 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 20 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ పలువురు మంత్రులతో సోమవారం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని కేసీఆర్‌, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు. ఈ సమావేశాలకు సిద్థం కావాలని మంత్రులు, అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2020-08-18T06:52:08+05:30 IST