LIVE..: 8వరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2020-09-16T16:10:10+05:30 IST
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. కాగా శాసనసభ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. దీనికి సంబంధించి నిన్న బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బిల్లులన్నీ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో సమావేశాలు బుధవారంతో ముగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం విధితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి...