గుజరాత్‌లో కూడా మేం పోటీ చేస్తాం: అసదుద్దీన్‌

ABN , First Publish Date - 2020-12-30T02:13:36+05:30 IST

దేశ వ్యాప్తంగా మజ్లిస్‌ను బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న

గుజరాత్‌లో కూడా మేం పోటీ చేస్తాం: అసదుద్దీన్‌

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మజ్లిస్‌ను బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. గుజరాత్‌లోని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. మధ్యప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. లవ్ జిహాద్‌తో పాటు, పలు రాష్ట్రాల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


బీజేపీపై విమర్శలు..

లవ్ జిహాద్ ఆర్డినెన్స్ చట్టంపై అసదుద్దీన్‌ మండిపడ్డారు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛని హరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని.. బీజేపీ నేతలకు రాజ్యాంగం పట్ల అవగాహన లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-30T02:13:36+05:30 IST