చర్చలు జరుపుతుంటే ఈ మరణాలేమిటి?

ABN , First Publish Date - 2020-06-18T09:22:35+05:30 IST

దేశ రక్షణ కోసం చైనా బలగాలతో తలపడి అసువులు బాసిన భారత సైనికులకు మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాళులర్పించారు.

చర్చలు జరుపుతుంటే ఈ మరణాలేమిటి?

  • అసదుద్దీన్‌ ఒవైసీ..  వీర సైనికులకు నివాళి

హైదరాబాద్‌, జూన్‌17 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం చైనా బలగాలతో తలపడి అసువులు బాసిన భారత సైనికులకు మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాళులర్పించారు. సైనిక కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృఽథా కాదన్నా రు. ప్రధాని మోదీ చైనా ప్రతినిధులతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించిన నేపధ్యంలో భారత సైనికులు ఎందుకు మరణించారని ఆయన ప్రశ్నించారు. చైనా బలగాల దాడి లో ఎంత మంది భారత సైనికులు ప్రాణత్యాగాలు చేశారు? ఎంత మంది  బందీలయ్యారు? మరెంత మంది దాడుల్లో గాయపడ్డారో స్పష్టం చేయాల ని డిమాండ్‌ చేశారు. చైనా దాడిలో 40 ఏళ్ల క్రితం భయంకరమైన నష్టం జరిగిందని అసదుద్దీన్‌ ఒవైసీట్విటర్‌లో పేర్కొన్నారు. భారత సైనికుల మరణానికి ప్రధాని తన వైఫల్యాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-18T09:22:35+05:30 IST