అత్యాచార నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-03-08T11:19:26+05:30 IST
వరంగల్‌రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపెల్లిలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందుతుడిని అరెస్టు

రాయపర్తి, మార్చి 7 : వరంగల్‌రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపెల్లిలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందుతుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏసీపీ రమేష్ నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వంగాల ఎల్లస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.