సంఘం నేతను బెదిరించిన కేసు.. ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2020-08-20T09:36:20+05:30 IST
తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు

- నిందితుడు మల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్
వనస్థలిపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ను చంపుతామంటూ బెదిరించిన ఘటనలో కూకట్‌పల్లికి చెందిన జయప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. లాక్‌డౌన్ సమయంలో స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాల్లో కోతలు విధిస్తున్నాయని, అకౌంట్‌లో వేతనాలు వేసి తర్వాత వెనక్కి తీసుకుంటున్నాయని పేర్కొంటూ సీఎం, విద్యాశాఖ మంత్రికి సంతో్‌షకుమార్ ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. సంతో్‌షకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం జయప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు.