అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-03-13T11:46:32+05:30 IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అదే గ్రామానికి చెందిన యువకుడు సందీ్‌పను గురువారం అరెస్టు చేసి

గూడూరు, మార్చి 12: ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అదే గ్రామానికి చెందిన యువకుడు సందీ్‌పను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మానుకోట డీఎస్పీ ఎ.నరే్‌షకుమార్ తెలిపారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం వివరాలు వెల్లడించారు. నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారానికి చెందిన మైనర్ బాలిక అప్పరాజ్‌పల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది.
ఈనెల 10న సందీప్ బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులోని వాటార్ టల్యాంక్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడు చూసి గ్రామస్తులకు చెప్పడంతో సందీ్‌పకు దేహశుద్ధి చేసినట్లు తెలిపారు. బాలికను గత నెల 29న కూడా సందీప్ అత్యాచారం జరిపినట్లు విచారణలో తేలింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ట్రెయినీ ఐపీఎస్ గౌతమ్, ఎస్సై ఎస్కే యాసిన్, ఏఎస్సై శ్యాంసుందర్, సిబ్బంది రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.