ఇబ్బందులు కలగనివ్వం

ABN , First Publish Date - 2020-03-28T10:10:24+05:30 IST

లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రప్రజలు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మెదక్‌

ఇబ్బందులు కలగనివ్వం
మెదక్‌లోని కలెక్టరేట్‌లో ప్రెస్‌మీట్‌కు ముందు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు

వరి, మొక్కజొన్న పంటల కొనుగోలుకు ఏర్పాటు: హరీశ్‌

మెదక్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రప్రజలు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శుక్రవారం సమీక్ష సమావేశాన్ని  నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల అధికారులు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జిల్లాలో లాక్‌డౌన్‌ పరిస్థితులు, నిత్యావసర సరుకుల లభ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వరి, మొక్కజొన్న దిగుబడులను పూర్తిస్థాయిలో కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులెవరూ తొందరపడి ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించవద్దని, పంటలకు మద్దతు ధర ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

Updated Date - 2020-03-28T10:10:24+05:30 IST