సోనియాపై అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-04-24T21:12:57+05:30 IST

సోనియాపై అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఉత్తమ్‌

సోనియాపై అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఉత్తమ్‌

నల్గొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాపై జర్నలిస్టు అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యంలో క్వాలిటీ లేదన తప్పుబట్టారు. కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్‌ ఇంకా అందలేదన్నారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వం మాటలకు, ఆచరణకు పొంతనలేదని మండపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ట్రిపుల్‌ టి సూత్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని, కరోనా వ్యాప్తికి మతం రంగు పూయొద్దని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలి, కరోనా పరీక్షలు చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-24T21:12:57+05:30 IST