ఆర్మీ రహస్యాల లీక్ కేసు... తెలంగాణ యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-03-12T22:42:05+05:30 IST

మెట్‌పల్లికి మరోసారి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు వెళ్లారు. ఆర్మీ రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో జమ్మూ పోలీసులు మెట్‌పల్లిలో ..

ఆర్మీ రహస్యాల లీక్ కేసు... తెలంగాణ యువకుడి అరెస్ట్

జగిత్యాల: మెట్‌పల్లికి మరోసారి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు వెళ్లారు. ఆర్మీ రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో జమ్మూ పోలీసులు మెట్‌పల్లిలో విచారణ చేపట్టారు. స్థాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అతన్ని జమ్మూ‌కు తరలించారు. గతసారి వారెంట్ లేకుండా జడ్జి ఎదుట ప్రవేశపెట్టడంతో అరెస్టుకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి ట్రాన్సిట్‌ వారెంట్‌ అనుమతితో జడ్జి ఎదుట హాజరుపరచడంతో అరెస్టుకు అనుమతి ఇచ్చారు. దీంతో సరికెల లింగన్నను అరెస్టు చేసి జమ్మూకు తరలించారు. 


జమ్మూ-కశ్మీర్‌ ఆర్మీ క్యాంపులో రాకేశ్ అనే యువకుడు కార్మికుడిగా పని చేస్తున్నారు. సైన్యం సమాచారాన్ని అనిత అనే మహిళకు చేరవేస్తున్నారు. జనవరిలో రాకేశ్‌పై కేసు నమోదు చేశారు. రాకేశ్ ఖాతాకు వివిధ బ్యాంకుల నుంచి సొమ్ము వచ్చినట్లు విచారణలో గుర్తించారు. లింగన్న ఖాతా నుంచి కూడా పలుమార్లు రాకేశ్ ఖాతాకు డబ్బులు పంపినట్లు కూడా నిర్ధారించారు. ఫిబ్రవరి 13న రూ.5 వేలు, 20న రూ.40 వేలు రాకేశ్ ఖాతాకు సరికెల లింగన్న గూగుల్ పే ద్వారా డబ్బులు పంపారు.

Updated Date - 2020-03-12T22:42:05+05:30 IST