ఆర్బీఐ సర్క్యులర్‌పై వ్యాజ్యాల్లో ముగిసిన వాదనలు
ABN , First Publish Date - 2020-11-03T08:25:24+05:30 IST
అనుమానాస్పద అకౌంట్లను మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించి అన్ని బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద అకౌంట్లను మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించి అన్ని బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌పై దాఖలైన బ్యాచ్ పిటిషన్లలో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యాల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
ఈ వ్యాజ్యాల్లో న్యాయవాదులు చేసిన వాదనలను రాతపూర్వకంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ నేపథ్యంలో బీఎస్ కంపెనీ బ్యాంకు ఖాతాలను మోసపూరితమైనవిగా ఎస్‌బీఐ ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి.