అందరికీ అందుబాటులో 'సరళ్ జీవన్ బీమా' పథకం

ABN , First Publish Date - 2020-11-04T00:44:35+05:30 IST

అందరికీ అందుబాటులో 'సరళ్ జీవన్ బీమా' పథకం

అందరికీ అందుబాటులో 'సరళ్ జీవన్ బీమా' పథకం

హైదరాబాద్: ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం “ఆరోగ్య సంజీవని” మరియు కొవిడ్-19 బీమా పథకాలు విజయవంతమైన తర్వాత ఐఆర్డీఏఐ మరో ప్రామాణిక జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అదే సరళ్ జీవన్ బీమా పథకం. ఇది సమగ్ర రక్షణను అందించే బీమా పథకమని ఐఆర్డీఏఐ పేర్కొంది.


ఈ పథకం కింద కవరేజీ రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. భారతదేశంలోని మొత్తం 24 జీవిత బీమా సంస్థలు సరళ్ జీవన్ బీమా పథకాన్ని అందించనున్నాయి. ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు  అన్ని బీమా సంస్థలు జనవరి 1, 2021 సంవత్సరంలోపల ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 


సరళ్ జీవన్ బీమా అనేది పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ ను పోలి ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే పాలసీ యొక్క కాల వ్యవధి  నాలుగు సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల ప్రకారం ఈ బీమా పథకం కింద ఒక వ్యక్తి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. బీమా పథకాన్ని లింగం, నివాస స్థలం, వృత్తి లేదా విద్య అర్హతలపై పరిమితులు లేకుండా అందరికీ అందించాలని ఐఆర్డీఏఐ పేర్కొంది.


Updated Date - 2020-11-04T00:44:35+05:30 IST