ప్రతి 6 నెలలకు నియామకాలు

ABN , First Publish Date - 2020-10-04T07:50:08+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని ఖాళీలను ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ ..

ప్రతి 6 నెలలకు నియామకాలు

సబ్‌ సెంటర్‌ నుంచి పీహెచ్‌సీల దాకా  అన్నీ మెడికల్‌ బోర్డు ద్వారానే  భర్తీ.. పీహెచ్‌సీలకు ఆయుష్‌ డిస్పెన్సరీలు

ఆస్పత్రికో అంబులెన్స్‌ తప్పనిసరి

రోగుల సాయానికి రిసెప్షన్‌లు.. 

చికిత్సపై వివరాల కోసం కౌన్సిలర్లు: ఈటల


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని ఖాళీలను ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్‌ సెంటర్‌ నుంచి పీహెచ్‌సీల దాకా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.  వైద్యఆరోగ్య శాఖను బలోపేతం  చేసే చర్యల్లో భాగంగా శనివారం అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్న 2034 పోస్టులను, ప్రజారోగ్య సంచాలకుల విభాగంలోని 5658 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయు్‌షలో గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆయుర్వేద, యునానీ, హోమియో, నేచురోపతి  యోగా విభాగాల్లో ఉన్న టీచింగ్‌ పోస్ట్‌ల ఖాళీలను వెంటనే భర్తీ  చేయాలని ఆదేశించారు.


ఆయుష్‌ డిస్పెన్స రీ సెంటర్లను వెలనెస్‌ సెంటర్లుగా మార్చాలని, ప్రస్తుతం 440 ప్రభుత్వ డిస్పెన్సరీలు, 394 ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్‌ డిస్పెన్సరీలు పని చేస్తున్నాయన్నారు. తక్కువ పేషెంట్లు వస్తున్న డిస్పెన్సరీస్‌ అన్నిటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లోనే ఆయుష్‌ విభాగాలు కూడా ఉండేలా చూడాలన్నారు. ఆయుష్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని ఆదేశించారు.  కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్‌ గా మారిందని, ప్రతి రోగికి ఆ మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పదోన్నతులకు సమస్యలు లేకుండా నిబంధనలు రూపొందించాలని, పని చేయని వారి మీద చర్యలు తీసుకొనేవిధంగా నిబంధనలు మార్చాలని ఆదేశించారు. 108 , 104 , 102 వాహనాలు ఎక్కడ అవసరం ఉందో లెక్క తీయాలని కోరారు.


సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఆయుష్‌ డైరెక్టర్‌ ప్రశాంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డా.రమేశ్‌ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండి చంద్రశేఖర్‌ రెడ్డి, కోవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి, డాక్టర్‌ గంగాధర్‌, డీఎంఈ, టీవీవీపీ, డీహెచ్‌, ఆయుర్వేద, హోమియో, యునానీ, యోగా, నాచురోపతి విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


సమీక్షలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

పబ్లిక్‌ హెల్త్‌ నుంచి వైద్య విధాన పరిషత్‌కి మార్చిన 15 ఆస్పత్రుల్లో ఇప్పటికే కొన్ని భవనాలు పూర్తయ్యాయి. వాటిల్లో అవసరం మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించాలి. 

ప్రతి హాస్పిటల్‌కి అంబులెన్స్‌ ఉండాలి 

సీటీ స్కాన్‌ కోసం పూర్తి స్థాయి ల్యాబ్‌లు ఏర్పాటు 

అవసరం ఉన్న చోట్ల అన్ని వైద్య పరికరాలు ఏర్పా టు. వాటికి యాన్యువల్‌ మెయింటెనెన్స్‌ తప్పనిసరి. 

ఏం చికిత్స అందిస్తున్నామో ఎప్పటికప్పుడు రోగికి వారి బంధువులకు తెలపాలి. అందుకోసం పేషంట్‌ కౌన్సిలర్స్‌ను ఏర్పాటు చేయాలి. 

ప్రతి ఆస్పత్రిలో రిసెప్షన్‌  ఏర్పాటు.

ఇన్‌ సర్వీస్‌ పీజీ చేసిన తర్వాత వారి ేసవలు వైద్య విధాన పరిషత్‌ , డీఎంఈ ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలి. 

కరెంటు కనెక్షన్‌లు సరిగా ఉండేలా చూడాలి. అవసరం ఉన్న దగ్గర జనరేటర్‌ ఏర్పాటు చేయాలి. 

ఏ ఒక్క హాస్పిటల్‌లో, ఆఫీసులో పనికి రాని వస్తువులు, చెత్త ఉండొద్దు.

అన్ని ఆస్పత్రులకు రంగులు వేయాలి. 

ప్రతి నెల 100ు బడ్జెట్‌ విడుదలయ్యేలా చర్యలు.

Updated Date - 2020-10-04T07:50:08+05:30 IST