వైస్ చాన్సలర్లను నియమించాలి: జాజుల
ABN , First Publish Date - 2020-07-18T08:20:59+05:30 IST
రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు

హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. విశ్వవిద్యాలయాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1100 పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేలా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని, అదే సందర్భంలో వర్సిటీల్లోని సమస్యలు కూడా తీర్చాలని ఆయన అన్నారు.