రాహుల్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించండి
ABN , First Publish Date - 2020-06-25T08:55:37+05:30 IST
రాహుల్ గాంధీని మళ్లీ ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ సోనియా గాంధీని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు.

సోనియాకు వంశీచంద్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీని మళ్లీ ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ సోనియా గాంధీని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. రాహుల్ గౌరవ నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ఒక దివ్యమైన తేజస్సును ప్రజ్వలింప చేస్తుందన్నారు.