గురుకుల కళాశాలల్లో 19 వరకు దరఖాస్తు

ABN , First Publish Date - 2020-07-14T08:41:23+05:30 IST

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ

గురుకుల కళాశాలల్లో 19 వరకు దరఖాస్తు

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల  కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బాల బాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలుంటాయని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 


లాటరీ కాదు.. ప్రవేశ పరీక్షే: ప్రవీణ్‌కుమార్‌

సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని 5వ తరగతిలో లాటరీ పద్ధతిలో ప్రవేశాల ఎంపిక ఉంటుందంటూ వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని  గురుకుల విద్యాలయాల సంస్థ కార్యర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.  

Updated Date - 2020-07-14T08:41:23+05:30 IST