13 వరకు రైతుబంధుకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-06-11T11:53:45+05:30 IST
13 వరకు రైతుబంధుకు దరఖాస్తులు

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకొని ఉండి.. ఒక్కసారి కూడా రైతుబంధు పొందని రైతులు ఈనెల 13వ తేదీ వరకు సంబంధిత ఏఈవోకు దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయశాఖ గడువు విధించింది. దరఖాస్తు ఫారంతోపాటు భూమి పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీ, తహసీల్దారు డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంకు సేవింగ్ ఖాతా పాస్ పుస్తకం జిరాక్సు కాపీలను తమ క్లస్టర్‌కు బాధ్యునిగా ఉన్న ఏఈవోకు సమర్పించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా డిజిటల్ సిగ్నేచర్ అయిన పట్టాదారుల వివరాలను ఏఈవోలు సేకరిస్తున్నారు. గతంలో డిజిటల్ సంతకం అయ్యి, పాస్‌పుస్తకాలు పొందిన రైతులు, ఇప్పటికే రైతుబంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రైతుబంధులో ఎన్‌రోల్‌మెంట్ ప్రతి సీజన్‌కు పెరుగుతోంది. గతంలో 55 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 59.30 లక్షలకు చేరింది. ఆర్‌వోఎ్‌ఫఆర్ రైతుల లెక్క కూడా కలిపితే 60.32 లక్షలకు చేరింది.