2 నుంచి ‘బెస్ట్‌’ దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-10-31T09:58:24+05:30 IST

2 నుంచి ‘బెస్ట్‌’ దరఖాస్తుల స్వీకరణ

2 నుంచి ‘బెస్ట్‌’ దరఖాస్తుల స్వీకరణ

ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహాయం కోసం ఉద్దేశించిన ‘బెస్ట్‌’ పథకం దరఖాస్తులను వచ్చే నెల 2 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధికారులు తెలిపారు. వివేకానంద విదేశీ విద్య, శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వేదహిత (వేద పాఠశాలలు, వేద/శాస్త్ర పండితులకు గౌరవ వేతనం) పథకాల దరఖాస్తులనూ స్వీకరిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు వచ్చే నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు ఠీఠీఠీ.ఛట్చజిఝజీుఽఞ్చటజీటజ్చిఛీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

Read more