తక్షణ సాయం అందించిన ఏపీ
ABN , First Publish Date - 2020-08-22T09:02:15+05:30 IST
తక్షణ సాయం అందించిన ఏపీ
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు అధికారులు సాయం అందించారు. గురువారం అర్ధరాత్రి తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ అధికారులు ఏపీ విద్యుత్తు అధికారులకు ఫోన్ చేసి ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నామని చెప్పారు. దీంతో ఏపీ అధికారులు వెంటనే కుడి గట్టు విద్యుత్తు కేంద్రానికి చెందిన అధికారులను అప్రమత్తం చేసి, సాయం అందించాలని ఆదేశించారు.అధికారులు అంబులెన్సులు, వైద్యులను ఘటనా స్థలానికి పంపారు. ప్రమాదం కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీటిని పరిశీలించేందుకు రావాల్సిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన కూడా వాయిదా పడింది.