కృష్ణారివర్ బోర్డు చైర్మన్‌తో ఏపీ అధికారుల భేటీ
ABN , First Publish Date - 2020-05-18T22:27:32+05:30 IST
కృష్ణారివర్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్‌తో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్

హైదరాబాద్: కృష్ణారివర్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్‌తో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ 190 టీఎంసీల నీటిని వాడుకుంటోందని ఏపీ ఫిర్యాదు చేసింది. అలాగే తెలంగాణకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి.. 200 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం ఉందని ఏపీ స్పష్టం చేసింది. ఇక తమకు కేటాయించిన నీటినే తరలించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ పేర్కొంది.
మా వాదనలు వినిపించాం..
కృష్ణా బేసిన్‌లో ఏపీ వాటాపై మా వాదనలు వినిపించామని ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విని బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.