ఏపీ సీఎంవో అధికారులకు అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2020-07-09T01:21:12+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కార్యాలయం అధికారులకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు అదనంగా ఏడు శాఖల బాధ్యతలను అప్పగించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కార్యాలయం అధికారులకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు అదనంగా ఏడు శాఖల బాధ్యతలను అప్పగించారు. వాటిలో జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, లా, శాసనసభ వ్యవహారాలు, సీఎం కార్యాలయ వ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, పునర్విభజన చట్టం, ప్రధాని-కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం లేఖలు, ఇతర వ్యవహారాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అదేవిధంగా సీఎంవో కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్‌కు ఆర్ అండ్ బీ, రవాణా, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, గనులు, కార్మిక శాఖలను కేటాయించారు. సీఎంవో అడిషనల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డికి జల వనరులు, పర్యావరణం, అడవులు, పురపాలక శాఖ, వ్యవసాయం, వైద్యం, విద్యుత్, పర్యాటకశాఖ, మార్కెటింగ్, ఫైనాన్స్ శాఖలను అప్పగించారు.