డాలర్ భాయ్ వ్యవహారంలో మరో ట్విస్ట్..
ABN , First Publish Date - 2020-09-01T20:59:44+05:30 IST
పంజాగుట్ట యువతి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : పంజాగుట్ట యువతి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే తనపై 139 మంది అత్యాచారం చేయలేదని.. తనను బెదిరించి డాలర్ భాయ్ అలా చేశాడని బాధితురాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 139 మందిలో 40శాతం మందికి పైగా అమాయకులే ఉన్నారని, వారంతా తనను క్షమించాలని కోరింది. డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి బెదిరింపుల వల్లనే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని మీడియాకు వెల్లడించింది. కాగా.. ముందు నుంచే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఈ విషయాలన్నీ ప్రసారం చేసింది. చివరికి ఏబీఎన్ చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యమయ్యాయి.
తప్పించుకుని తిరుగుతున్నా..!
అయితే తాజాగా డాలర్ భాయ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. 4 రోజుల క్రితం నన్ను కిడ్నాప్ చేయాలని చూశారంటూ డాలర్ భాయ్ మరో డ్రామాకు తెరదీశాడు. ‘కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని ఏసీపీకి కాల్ చేశారు. కోనేటి అశోక్, సుమన్ నుంచి నాకు ప్రాణహానీ ఉంది. ప్రాణభయంతో తప్పించుకొని తిరుగుతున్నాను. పోలీసులు ఎవరూ నన్ను బెదిరించలేదు. మ్యాట్రిమోనిలో పరిచయమైంది.. నా కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా పని చేసింది. బాధితురాలి సర్టిఫికెట్లు ఎవరూ తీసుకెళ్లలేదు.. ఆమె వద్దే ఉన్నాయి. అందర్ని నమ్మించడానికి సర్టిఫికెట్లు రజనీచౌదరికి ఇచ్చినట్లు వీడియో తీశాం’ అని డాలర్ భాయ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. బాధితురాలు వ్యభిచారం చేసిందంటూ ఏబీఎన్‌కు డాలర్ భాయ్ సెల్ఫీ వీడియో కూడా తీసి పంపాడు. అయితే ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు ఎలా ముందుకెళ్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.