ఏపీ నుంచి తెలంగాణకు మరో ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-11T08:06:26+05:30 IST

ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన వారిలో మరో ఎస్పీ(నాన్‌ కేడర్‌)ని తెలంగాణ

ఏపీ నుంచి తెలంగాణకు మరో ఎస్పీ

ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన వారిలో మరో ఎస్పీ(నాన్‌ కేడర్‌)ని తెలంగాణ కోసం  అక్కడి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఏపీలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌.రంగారెడ్డిని  రిలీవ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారుల అభ్యర్ధన మేరకు ఏపీలో విధులు నిర్వహిస్తున్న వారిలో ఇప్పటికే పలువురు ఎస్పీ(నాన్‌కేడర్‌), డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లను అక్కడి ప్రభుత్వం రిలీవ్‌ చేసి  తెలంగాణకు పంపింది.


Updated Date - 2020-12-11T08:06:26+05:30 IST