వేదాద్రి ప్రమాదంలో మరో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-06-22T09:29:03+05:30 IST

ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న..

వేదాద్రి ప్రమాదంలో మరో వ్యక్తి మృతి

13కు చేరిన మృతుల సంఖ్య


 ఎర్రుపాలెం, జూన్‌ 21: ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కామసాని వీర్రాజు(21) ఆదివారం మృతిచెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపారానికి చెందిన ఓ రైతు కుంటుంబం ఈ నెల 17న వేదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-22T09:29:03+05:30 IST