మరో 384 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-12-15T08:48:42+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 384 మంది కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,78,108కు పెరిగింది. ఇన్ఫెక్షన్‌తో మరో ముగ్గురు మృతిచెందడంతో మరణాల

మరో 384 పాజిటివ్‌లు

 26 జిల్లాల్లో 10లోపే కేసులు

 కరోనా వ్యాక్సినేషన్‌పై శిక్షణ ప్రారంభం

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా 384 మంది కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,78,108కు పెరిగింది. ఇన్ఫెక్షన్‌తో మరో ముగ్గురు మృతిచెందడంతో మరణాల సంఖ్య 1496కు చేరింది. ఆదివారం 631 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు 2,69,232 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మరో 7,380 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.


కొత్త కొవిడ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 101, మేడ్చల్‌లో 31, రంగారెడ్డిలో 36, వరంగల్‌ అర్బన్‌లో 25, కరీంనగర్‌లో 16, ఖమ్మంలో 13, సంగారెడ్డిలో 14 కేసులు నమోదవగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పదిలోపే నమోదయ్యాయి. కాగా, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వర్చువల్‌ శిక్షణ కార్యక్రమం కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయంలో సోమవారం ప్రారంభమైంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.


ఈసందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రణాళిక, శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం, వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన పద్ధతులపై వారికి అవగాహన కల్పించారు. వ్యాక్సిన్‌ వేయించుకునేలా ప్రజలను ఏవిధంగా చైతన్యవంతం చేయాలి? ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేయాలి ? అనే దానిపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యూనిసెఫ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

మంగళవారం కూడా ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. దీన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. 


Updated Date - 2020-12-15T08:48:42+05:30 IST