అన్నపూర్ణ భోజన పథకం ఇతర రాష్ర్టాలకు స్పూర్తిని నిలిచింది- తలసాని
ABN , First Publish Date - 2020-03-03T00:01:46+05:30 IST
ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

హైదరాబాద్: ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గతంలో జీహెచ్‌ఎంసి కమిషనర్‌వ్యవహరించిన కాలంలో ఈ పథకానికి శ్రీకార చుట్టారని అన్నారు. 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈపథకం ప్రస్తుతం 150 కేంద్రాల ద్వారా కొనసాగుతోందన్నారు. రోజుకు 30 నుంచి 35వేల మంది ఆకలిని తీరుస్తోందన్నారు. అన్నపూర్ణ భోజనపథకాన్ని ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం అమీర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడారు. అమీర్‌పేట్ కేంద్రంలో అత్యధికంగా రోజుకు 1200 మంది ఆకలి తీరుస్తున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధులు, కార్మికులుఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారని అన్నారు.
హైదరాబాద్‌నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నదని తె లిపారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు. చీఫ్‌సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆకలితో ఏ వ్యక్తీ ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 55 చోట్ల నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల సంఖ్యను 150 కేంద్రాలకు పెంచినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జీహెచ్‌ఎంసి కృషితో అన్నపూర్ణపథకం ద్వారా 4 కోట్ల భోజనాల మైలు రాయిని చేరుకున్నట్టు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ అన్నపూర్ణభోజన పథకం ప్రభుత్వానికి తృప్తిని ఇచ్చిన పథకమని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కంటోన్మెంట్‌కు కూడా విస్తరరించినట్టు తెలిపారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఛారిటబుల్ సంస్థ చూపుతున్న శ్రద్ధ వల్లపేదలకు నాణ్యమైన భోజనంతో పాటు అందరికీ గుర్తింపు లభిస్తున్నద ని అన్నారు. ఈసందర్భంగా హరేకృష్ణచారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస మాట్లాడుతూ అన్నపూర్ణ పథకం రాష్ట్రంలో రోజుకు 45వేల మంది ఆకలిని తీరుస్తోందన్నారు. ఈసందర్భంగా మొబైల్ అన్నపూర్ణ భోజన పథకాన్ని చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ప్రారంభించారు. కార్య క్రమంలో స్థానిక కార్పొరేటర్ శేషుకుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులుపాల్గొన్నారు.