రాష్ట్రవ్యాప్తంగా 28వ తేదీ నుండి బ్రూసెల్లోసిస్ నివారణ టీకాల పంపీణీ

ABN , First Publish Date - 2020-12-27T22:32:34+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 28వ తేదీ నుండి జనవరి 2వ తేదీవరకూ బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు నాలుగు నుండి ఎనిమిది నెలల వయసు గల ఆవు, గేదె జాతి ఆడ దూడలకు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ, సంచాలకులు డాక్టర్ వి.లక్ష్మారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 28వ తేదీ నుండి  బ్రూసెల్లోసిస్ నివారణ టీకాల పంపీణీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 28వ తేదీ నుండి జనవరి 2వ తేదీవరకూ  బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక  టీకాలు నాలుగు నుండి ఎనిమిది నెలల వయసు గల ఆవు, గేదె జాతి ఆడ దూడలకు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ, సంచాలకులు డాక్టర్  వి.లక్ష్మారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ వ్యాధి బృసెల్లా అనే  బ్యాక్టీరియా ( సూక్ష్మక్రిమి) ద్వారా అనేక రకాల జంతువులు  అయిన గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు కుక్కలు, జింకలు, అడవి జంతువులు మరియు మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి జూనోటిక్ వ్యాధి. అంటే వ్యాధి సోకినా పశువుల నుండి మనుషులకు సోకుతుంది.


ఈ వ్యాధి రాష్ట్రంలో  పాడి పరిశ్రమ మరియు మాంస పరిశ్రమకు వేల కోట్ల రూపాయల ఆర్ధిక నష్టం ప్రతి సంవత్సరం కలగజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి  నివారణలో  భాగంగా రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీకాల కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో చేపట్టడo జరిగింది.ఈ వ్యాధి తీవ్రమైన, వృత్తిపరమైన వ్యాధి. తక్కువ ఉస్నోగ్రతలలో, అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులలో ఈ వ్యాధి పశువులకు  సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువు, సంపర్కం ద్వారా ఇతర పశువులకు, ఈనిన తర్వాత మావి, గర్భస్రావ ద్రవాల ద్వారా, నోటిలో, కంటిలో పడి, మనుషులకు, పశువులకు  వ్యాపిస్తుంది.


కలుషితమైన వస్తువులు, పరికరాలు, దుస్తులు, బూట్లు, ఎండుగడ్డి, దాన,నీరు మరియు వాహనాల ద్వారా వ్యాధి ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. చూడి పశువులు  ఆరు నెలల గర్భం తర్వాత ఈసుకు  పోతాయి. మాయ వేయవు.గర్భాశయ వ్యాధుల బారిన పడతాయి. ఈ వ్యాధి వల్ల పశువుల పునరుత్పత్తి, ఉత్పత్తి సమస్యలు, వందత్వం,కీళ్ల నొప్పులు, పొదుగు వాపు వ్యాధి, ఉత్పత్తి తగ్గడం మరియు పశువులు  బలహీనమై  ఉత్పత్తి, పునరుత్పత్తి సమస్యలు వస్తాయి. వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి.


ఈ వ్యాధి మనుషులలో వేడి చేయని పాలు తాగడం ద్వారా గాయాలతో కూడిన చర్మంలోకి, కళ్ళలోకి సూక్ష్మజీవి చొచ్చుకుని పోవడం ద్వారా, పశువులలో వృత్తిపరమైన  పశు వైద్య మరియు పారా సిబ్బంది, జీవాల పెంపకం దారులు, పాడి రైతులు, పాలు, మాంస పరిశ్రమలలో పనిచేయు కార్మికులకు, గర్భకోశ శ్రావలు కంటిలో, నోట్లో పడటం, గాయాల పై పడటం  ద్వారా సోకుతుంది.
ఈ వ్యాధి సోకిన మనుషులకు దీర్ఘకాలిక తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు,వాపులు, రాత్రి చెమట పట్టడం, దగ్గు రావడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వృషణాల వాపు, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం జరగడం లాంటి లక్షణాలు కనబడతాయి.ఈ వ్యాధి సోకిన పశువుల పాకలను మూత్రము, రక్తము, పాలు, గర్భస్రావాలు పడిన ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు స్ప్రే చేయించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను మిగతా పశువులకు  దూరంగా ఉంచాలి. బాగా మరిగించి చల్లార్చిన తర్వాతనే పాలు తాగాలి. చేతి గ్లోవ్స్, నోరు ముక్కుకు  మాస్కులు విధిగా ధరించి పశువులు ఈనే సమయంలో పని  చేయాలి.


రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పశు సంపద ఆరోగ్య పరిరక్షణలో భాగంగాఈ టీకాల కార్యక్రమం చేపట్టి ఈ వ్యాధిని నివారించి , రాష్ట్ర మాంస, పాల ఉత్పత్తి పెంపొందించడం ద్వారా రాష్ట్ర రైతుల ఆదాయం పెంపుదలకు  రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆరు రోజుల పాటు  నాలుగు నుండి ఎనిమిది నెలల వయస్సు గల అన్ని  ఆడ  దూడలకు  టీకాలు పశు వైద్య సిబ్బంది, మండల పశువైద్యాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు ప్రతి గ్రామాన్ని పైన పేర్కొన్న తేదిలలో రైతులకు ప్రజాప్రదినిధులకు  ఒక రోజు ముందు సమాచారం అందించి ఈ టీకాలు వేయడం జరుగుతుంది.


ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని తమ ఆడ గేదె లేగ దూడలకు టీకాలు వేయించి ఈ వ్యాధి నుండి భవిష్యత్లో ఈ వ్యాధి రాకుండా  పశుసంపదను  రక్షించుకో వచ్చని, తద్వారా  రైతులు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని సంచాలకులు, డాక్టర్ వి.లక్ష్మారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-27T22:32:34+05:30 IST