డిజిటల్‌ సాంకేతికతతో పశు గణన

ABN , First Publish Date - 2020-07-20T09:02:01+05:30 IST

పశు సంపదను గణించేందుకు డిజిటల్‌ సాంకేతికత ఉత్తమ విధానమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి లోక్‌సభ

డిజిటల్‌ సాంకేతికతతో పశు గణన

  • ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌కు ‘ప్రజెంటేషన్‌’ ఇచ్చిన జియోస్టాట్‌ సంస్థ
  • సీఎం, తలసాని దృష్టికి తీసుకెళ్తా: వినోద్‌


మేడ్చల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పశు సంపదను గణించేందుకు డిజిటల్‌ సాంకేతికత ఉత్తమ విధానమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి జియో స్టాట్‌ ఇన్ఫర్మేటిక్‌ సంస్థ ఎండీ వివేక్‌రెడ్డి ఆదివారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వినోద్‌కుమార్‌కు సాంకేతికతను వివరించారు. మనుషుల వేలి ముద్రలలాగే జంతువుల ముక్కు ముద్రల ఆధారంగా వాటిని గుర్తించవచ్చని వివరించారు. రాష్ట్రంలో పశు సంపదను గణించేందుకు డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ముక్కు ముద్రలను సేకరించి, సులువుగా ఆన్‌లైన్‌లో పొందుపరచవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి రుణం పొంది, సబ్సిడీపై కొనుగోలు చేసిన జంతువుల (ఆవులు, బర్రెలు, గొర్రెలు, తదితర) చెవులకు ఇయిర్‌ ట్యాగింగ్‌ వేస్తున్నామని, డిజిటల్‌ పద్ధతిలో ముక్కు ముద్రల సేకరణతో ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పవచ్చని వివరించారు. ఈ సాంకేతికతను సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని వినోద్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-07-20T09:02:01+05:30 IST