ఈ అంగన్‌వాడీ టీచర్ వృత్తి నిబద్ధతకు కేటీఆర్ ఫిదా
ABN , First Publish Date - 2020-04-05T08:17:07+05:30 IST
కరోనా వ్యాప్తి సమయంలోనూ, మారుమూల గిరిజన పల్లెల్లో తిరుగుతూ పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో...

వాజేడు, ఏప్రిల్ 4: కరోనా వ్యాప్తి సమయంలోనూ, మారుమూల గిరిజన పల్లెల్లో తిరుగుతూ పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో కొనియాడారు. ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు అంగన్‌వాడీ టీచర్ రమణమ్మ స్కూటీపై ఇంటింటికీ తిరుగుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందజేశారు. ఆమె సేవలు కేటీఆర్ దృష్టికి చేరడంతో.. ఆయన ఆమె ఫొటోను ట్వీట్ చేశారు. ఆమె పట్ల నెటిజన్ల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.