అంగన్‌వాడీ కేంద్రాలు ఆకర్షించేలా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-18T11:24:16+05:30 IST

చిన్నారులను ఆకర్షించే లా అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కలె క్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌అజీమ్‌

అంగన్‌వాడీ కేంద్రాలు ఆకర్షించేలా ఉండాలి

కలెక్టర్‌ మహ మ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌


కృష్ణకాలనీ, మార్చి 17: చిన్నారులను ఆకర్షించే లా అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కలె క్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌అజీమ్‌ మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలె క్టరేట్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ అధికా రులతో సమా వేశం నిర్వహించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 512 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, ప్రణాళిక బద్ధంగా  ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, సొంత స్థలాలలో అంగన్‌వాడీ భవనాలను కలిగి ఉన్న 148 అంగన్‌వాడీ కేంద్రాలను మూడు ఫేజ్‌లలో 48 చొప్పున అభివృద్ధి పరచాలని సూచించారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో మర మ్మతులను పూర్తిచేసి మోడ్రన్‌ కిచెన్‌, కిడ్స్‌ రూం, పేరేంట్స్‌ లాంజ్‌ ఏర్పాటు చేయాలన్నారు.


చిన్నారులకు ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో టీవీలను ఏర్పాటు చేసి పిల్లలకు ఆటలు, చిన్నచిన్న కథలు చూపించాలని తెలిపారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మెనూ ప్రకారం అందిం చాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అంగన్‌వాడీలను ఆవాసాల వారిగా మ్యాపింగ్‌ చేయా లని అన్నారు. ఇప్పటి వరకు ములుగు జిల్లాలోని తా డ్వాయి ప్రాజెక్టులో కొనసాగుతున్న రేగొండ, గణపురం మండలాల అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లాలో కలుపు కునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  స మావేశంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి, యువజన సంక్షేమ క్రీడల అభివృద్ధి అధికారి బుర్ర సునిత, సీడీపీవో సీహెచ్‌. అవంతి, రాధిక, పోషక అభియాన్‌ ప్రాజెక్టు అధికారి వైష్ణవి, అంగన్‌వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T11:24:16+05:30 IST