ఇంటి వద్దకే అంగన్‌వాడీ సరుకులు

ABN , First Publish Date - 2020-03-23T22:40:57+05:30 IST

కరోనా వైరస్‌ కట్డడి చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు

ఇంటి వద్దకే అంగన్‌వాడీ సరుకులు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్డడి చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే సరుకులన్నింటినీ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల మూసి వేత అనంతరం తీసుకోవల్సిన చర్యలపై మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌, కార్యదర్శితో మంత్రి సత్యవతి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలు మూసి వేయడం వల్ల అక్కడికి వచ్చే సరుకులు ఆగిపోతాయన్న ఆందోళనకు ఆస్కారం ఇవ్వకుండా వెంటనే అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే సరుకులన్నింటినీ ఇంటికే పంపిస్తామన్న ధీమా ప్రజల్లో కల్పించాలని అధికారులను సూచించారు.  అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలని అన్నారు.


గ్రామ కమిటీలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయా, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్‌, స్థానిక పోలీసు భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్దతిలో సరైన సమయంలో లబ్ధిఆరులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సెలువు దినాల్లో సరుకులు ఇవ్వడం లేదని, ప్రస్తుత అత్యవసర పరిస్థిఇతి నేపధ్యంలో సెలవు రోజుల్లో కూడా ప్రతి రోజూ మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చేవారిని గురించి, విదేశాల నుంచి వచ్చిన వారిని తెలిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.రొటేషన్‌ పద్దతిలో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని మంత్రి సూచించారు. 20శాతం వీలయితే ఇబ్బంది లేని పరిస్థితుల్లో విధులు నిర్వహించాలని అన్నారు. శిశు విహార్‌, హోమ్స్‌లలో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రత, పారిశుద్ద్యం పాటించేలా చూడాలన్నారు. 

Updated Date - 2020-03-23T22:40:57+05:30 IST