ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన..

ABN , First Publish Date - 2020-11-03T11:44:58+05:30 IST

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అలాగే ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతీ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, ఉత్తర మధ్య తమిళనాడు ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడ్డాయి. అయితే దక్షిణ బంగాళాఖాతం

ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన..

అమరావతి : ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అలాగే ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతీ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, ఉత్తర మధ్య తమిళనాడు ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడ్డాయి. అయితే దక్షిణ బంగాళాఖాతం మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 6 వరకు రాష్ట్రంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో పగటిపూటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Updated Date - 2020-11-03T11:44:58+05:30 IST