గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి మృతి

ABN , First Publish Date - 2020-12-11T08:20:37+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ఆంధ్రజ్యోతి విలేకరి ఎడమ చంద్రమౌళి (50) గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు.

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి మృతి

మహబూబాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ఆంధ్రజ్యోతి విలేకరి ఎడమ చంద్రమౌళి (50) గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. తన ఇంటి వద్ద అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

చంద్రమౌళికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  20 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ తన  కలం ద్వారా ప్రజా సమస్యలను వెలికితీసి పరిష్కారానికి కృషి చేశారు. 


Updated Date - 2020-12-11T08:20:37+05:30 IST