బలహీన వర్గాలకు టీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం: తలసాని

ABN , First Publish Date - 2020-03-02T09:38:40+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు టీఆర్‌ఎస్‌ సముచిత స్థానం కల్పించిందని మంత్రి తలసాని

బలహీన వర్గాలకు టీఆర్‌ఎస్‌లో  సముచిత స్థానం: తలసాని

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు టీఆర్‌ఎస్‌ సముచిత స్థానం కల్పించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 9 డీసీసీబీ, డీసీఎమ్మె్‌సలకు జరిగిన అధ్యక్ష ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని కొనియాడారు. అలాగే, గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిందని తలసాని అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరిగిన ‘గొల్ల గోల్వార్స్‌ యాదవ బహిరంగ సభ’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గడ్డి విత్తనాలు, 100 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-03-02T09:38:40+05:30 IST