ప్రభుత్వాసుపత్రులకు ప్రజాప్రతినిధుల అంబులెన్సులు

ABN , First Publish Date - 2020-07-28T08:44:48+05:30 IST

అంబులెన్సుల కోసం సాయం అందించాలంటూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మరికొంతమంది

ప్రభుత్వాసుపత్రులకు ప్రజాప్రతినిధుల అంబులెన్సులు


  • 6 అంబులెన్సుల కోసం మంత్రి  మల్లారెడ్డి సాయం

హైదరాబాద్‌/పెద్దపల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): అంబులెన్సుల కోసం సాయం అందించాలంటూ  మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మరికొంతమంది ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. సోమవారం ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన మంత్రి మల్లారెడ్డి.. తనవంతుగా 6 అంబులెన్సులను సమకూర్చేందుకు అవసరమైన నగదును చెక్కు రూపంలో అందజేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెండు అంబులెన్సుల చొప్పున, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌ రెడ్డి చెరొక అంబులెన్సు కోసం చెక్కులను కేటీఆర్‌కు అందజేశారు.


Updated Date - 2020-07-28T08:44:48+05:30 IST