ఉప్పొంగేవాగులో సాహసం చేసిన 108 డ్రైవర్

ABN , First Publish Date - 2020-08-20T23:51:06+05:30 IST

జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జంపన్నవాగు ఉధృతంగా....

ఉప్పొంగేవాగులో సాహసం చేసిన 108 డ్రైవర్

ములుగు: జిల్లాలో ఎడతెరిపిలేకుండా  కురుస్తోన్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి దొడ్ల, కొండాయి గ్రామాల మధ్య జంపన్నవాగుపై బ్రిడ్జి కుంగిపోయింది. 2015లో ఐదు కోట్ల రూపాయల నిధులతో ఈ వంతెనను నిర్మించారు. ఏజెన్సీలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెన  మధ్యలో కుంగిపోయింది. ఎప్పుడైనా కూలిపోయేలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే బ్రిడ్జి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని స్థానికులు భయపడుతున్నారు. 


బ్రిడ్జి కుంగిపోవడంతో కొండాయి, ఐలాపూర్‌తో పాటు మరికొన్ని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు ఈ మార్గంలో ప్రయాణించేవారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 108 సిబ్బంది సహాయం చేశారు. వాగు మధ్యలోకి రాగానే ఒక్కసారిగా వరద పెరిగినా చాకచక్యంతో డ్రైవర్ వ్యవహరించారు. అనారోగ్యంగా ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించారు. 




Updated Date - 2020-08-20T23:51:06+05:30 IST