అంబర్‌పేట్‌ వంతెన నిర్మాణంపై చొరవ చూపండి

ABN , First Publish Date - 2020-06-04T10:06:14+05:30 IST

అంబర్‌పేట్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 202 జాతీయ రహదారిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా స్థల సేకరణ పూర్తి కాలేదని, దీని వల్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం

అంబర్‌పేట్‌ వంతెన నిర్మాణంపై చొరవ చూపండి

  • సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 202 జాతీయ రహదారిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా స్థల సేకరణ పూర్తి కాలేదని, దీని వల్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సత్వరమే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాయని, దీని నిర్మాణం కోసం 2018 మే 5న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారని బుధవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. స్థల సేకరణ కోసం అప్పటి అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.76.33 కోట్ల నిధులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చొరవ చూసి వంతె నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-06-04T10:06:14+05:30 IST