247వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-08-20T15:35:25+05:30 IST
రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 247వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 247వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.