‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అనుమతివ్వండి: టీచర్లు
ABN , First Publish Date - 2020-09-03T09:59:00+05:30 IST
లాక్‌డౌన్-4 మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరు వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి లేదని, సెప్టెంబరు 21

హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్-4 మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరు వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి లేదని, సెప్టెంబరు 21 తర్వాత రోజూ 50% ఉపాధ్యాయులే హాజరయ్యేందు కు అనుమతించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన సదానందంగౌడ్, చావ రవి విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. కేంద్రం ఆదేశాలను విద్యాశాఖ అమలు చేయాలని కోరారు. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లి పిల్లలను డిజిటల్ క్లాసు లకు సిద్థం చేశారని, సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ పాఠాలు కూడా విజయవంతంగా ప్రారంభమయ్యాయని మంత్రికి వివరించారు. ఈ వారం రోజుల్లో స్కూళ్లకు వెళ్లిన ఉపాధ్యాయుల్లో పలువురికి కొవిడ్ సోకడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారని, జీవో-120లోని నిబంధనలు అమలు చేయాలని కోరారు. ఇదే అంశంపై పీఆర్టీయూ, టీపీఆర్టీయూ రాష్ట్ర శాఖలు సైతం మంత్రిని కలిశాయి. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు తెలిపారు.