బార్లు తెరిచేందుకు అనుమతించండి

ABN , First Publish Date - 2020-09-06T10:26:35+05:30 IST

బార్లు తెరిచేందుకు అనుమతించండి

బార్లు తెరిచేందుకు అనుమతించండి

శ్రీనివా్‌సగౌడ్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌కు యజమానుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నష్టాలతో సతమతమవుతున్న తమను బార్లు తెరిచేందుకు అనుమతించాలని తెలంగాణ రెస్టారెంట్‌, బార్‌ లైసెన్సీ అసోసియేషన్‌ ప్రతినిఽధులు కోరారు. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు చాగంటి మనోహర్‌గౌడ్‌, ప్రతినిఽధులు వెంకటేశ్‌ గౌడ్‌, పవన్‌గౌడ్‌, లింగారెడ్డి తదితరులు శనివారం ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌లను కలిసి వినతిపత్రాలను అందజేశారు. సిటింగ్‌కు కాకపోయినా... కనీసం కౌంటర్‌ సేల్స్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కౌంటర్ల నుంచి క్వార్టర్‌, హాఫ్‌ బాటిళ్లను విక్రయించేలా బార్లకు నిబ్‌ (180 ఎంఎల్‌), పింట్‌ (375 ఎంఎల్‌) లను సరఫరా చేయాలని అభ్యర్థించారు. అలాగే బార్ల లైసెన్సు గడువును ఆరు నెలల పాటు పొడిగించాలని కోరారు.

Updated Date - 2020-09-06T10:26:35+05:30 IST