పార్కులను తెరిచేందుకు అనుమతి ఇవ్వండి

ABN , First Publish Date - 2020-08-18T07:54:24+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనల్లో భాగంగా మూసేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి

పార్కులను తెరిచేందుకు అనుమతి ఇవ్వండి

  • 10% కంపా నిధులను విడుదల చేయండి:ఇంద్రకరణ్‌

కొవిడ్‌-19 నిబంధనల్లో భాగంగా మూసేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అడవుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు.. కంపా నుంచి 10ు నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రకాశ్‌ జావడేకర్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అటవీ మంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. నగర వన యోజన కింద 15 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, వాటికి అనుమతి ఇవ్వాలని ఇంద్రకరణ్‌ కోరారు. 

Updated Date - 2020-08-18T07:54:24+05:30 IST