లాక్‌డౌన్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలు

ABN , First Publish Date - 2020-04-24T22:42:32+05:30 IST

లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా పనులు లేక మధ్యతరగతి..

లాక్‌డౌన్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలు

హైదరాబాద్:  లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా పనులు లేక మధ్యతరగతి, వేతన జీవులు, చిరు వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పెస్ట్ కంట్రోలు చేసుకునేవారు, విద్యుత్ మీటరు బిల్లింగ్ ఇచ్చేవారు వాళ్లంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా బైక్ మెకానిక్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని, ప్రభుత్వం చెప్పినట్లుగా నిబంధనలు పాటించాలని.. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. తనకు తెలిసినవారు ఎవరైనా ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి బైక్ రిపేర్లు చేస్తున్నానని చెప్పారు.


అలాగే పెస్ట్ కంట్రోల్ చేసేవారు మాట్లాడుతూ పనులు ఉన్నా లాక్ డౌన్ వల్ల చేయలేని పరిస్థితి ఉందన్నారు. బయటకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని చాలా ఇబ్బందిగా ఉందన్నారు. కస్టమర్లు ఫోన్ చేసినా వెళ్లలేకపోతున్నామని, తమలాంటి వాళ్లకు పోలీసు అధికారులు పాస్ ఇస్తే కొంత వెసులుబాటుగా ఉంటుందన్నారు. విద్యుత్ మీటరు బిల్లింగ్ చేసేవారు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల రెండు నెలల నుంచి మీటరు బిల్లింగ్ చేయలేకపోతున్నామని, దీంతో తమకు కాంటాక్టర్లు జీతాలు కూడా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణలో సుమారు 15వేల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు.

Updated Date - 2020-04-24T22:42:32+05:30 IST