పోతిరెడ్డిపాడుపై నేడు అఖిలపక్ష భేటీ
ABN , First Publish Date - 2020-05-13T09:16:38+05:30 IST
పోతిరెడ్డిపాడుపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించేందుకు బుధవారం మరోసారి అఖిలపక్ష సమావేశం జరగనుందని టీజేఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో నేతలు సమావేశం కానున్నట్లు తెలిపింది.