ఈనెల 10న జాతీయ నులిపురుగల నివారణ రోజు

ABN , First Publish Date - 2020-02-08T21:44:14+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10న ‘జాతీయ నులిపురుగులదినం’గా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.

ఈనెల 10న జాతీయ నులిపురుగల నివారణ రోజు


 రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10న  ‘జాతీయ నులిపురుగులదినం’గా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. 1నుంచి19 సంవత్సరాల వయస్సుగల పిల్లలు,  కౌమార బాలబాలికలల్లో నులిపరుగలను  నివారించడానికి జాతీయ నులిపురుగుల నివారణ దినంగా పాటిస్తున్నారు. ఇప్పటి వరకూ జాతీయ నులిపురుగల దినం సందర్భంగా 8సార్లు అల్ఫెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మూడు లక్షల మంది పిల్లలు, కౌమార బాలబాలికలకు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ బాలబాలికలతో పాటు బడి బయటి పిల్లలకు 3.23 లక్షలు, ప్రైవేట్‌ పాఠవాలల విద్యార్ధులు 47 లక్షల మందికి ఈ మందును అందజేయాలని నిర్ణయించారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, మానసిక వికాసం, జీవన నాణ్యత మెరుగు పర్చడమే ఈ జాతీయ నులిపురుగుల దినం లక్ష్యం. అల్ఫెండజోల్‌ మాత్రలు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించబడిన, సమర్ధవంతమైన, ప్రమాద రహితమైనవని నిర్ధారణలో తేలినట్టుఅధికారులు తెలిపారు. పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో నులిపురుగల సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నులిపురుగులు పోషకాహార పోషణలో అడ్డుపడి వారిలో రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక, విద్యా, శారీరక అభివృద్ధి మందగించడానికి దారి తీస్తుందన్నారు. నులిపురుగుల నివారణ దినం సందర్భంగా అల్ఫెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసేందుకు 65వేల మంది ఉపాధ్యాయులు, 35,700 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 27వేల మంది ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అధికారులు తెలిపారు వీరి సహకారంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్ధులు, సాంకేతిక, జానియర్‌ కళాశాలల విద్యార్ధులకు మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రచార సాధనాలను ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-02-08T21:44:14+05:30 IST