మైండ్‌స్పేస్ కరోనా వార్తలపై అఖిల్ అక్కినేని ట్వీట్

ABN , First Publish Date - 2020-03-04T20:37:07+05:30 IST

హైదరాబాద్‌లో కరోనా వైరస్ ఆందోళన రేపుతోంది. హైదరాబాద్‌లో కొన్ని వేల మంది ఐటీ ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో...

మైండ్‌స్పేస్ కరోనా వార్తలపై అఖిల్ అక్కినేని ట్వీట్

హైదరాబాద్‌లో కరోనా వైరస్ ఆందోళన రేపుతోంది. హైదరాబాద్‌లో కొన్ని వేల మంది ఐటీ ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు వారందరినీ మైండ్‌స్పేస్‌లో కరోనా పాజిటివ్ వార్త మరింత భయాందోళనలోకి నెట్టేసింది. మైండ్‌స్పేస్‌లోని బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న డీఎస్‌ఎం కంపెనీకి చెందిన ఉద్యోగినికి కరోనా పాజిటివ్ రావడంతో అదే బ్లాక్‌లో పనిచేసే ఉద్యోగుల్లో గుబులు రేగింది. బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. ‘వర్క్ ఫ్రం హోం’ నోటీసులు జారీ చేశాయి.


సెలబ్రెటీలు కూడా మైండ్‌స్పేస్‌లో కరోనా పాజిటివ్ రావడంపై స్పందించారు. యువ హీరో అఖిల్ అక్కినేని తాజాగా ఓ ట్వీట్ చేశాడు. రహేజా మైండ్‌స్పేస్‌లో ఉద్యోగులను పంపించేస్తున్న విషయం గురించి ఇప్పుడే తెలిసిందని.. మీరు జాగ్రత్తగా ఉండండని, మీ చుట్టూ ఉన్న వారితో కూడా జాగ్రత్తగా ఉండాలని అఖిల్ సూచించాడు. ఇప్పుడు ఇది నిజంగా చాలా తీవ్రమైన సమస్య అని, జాగ్రత్తగా ఉండాలని.. ఆరోగ్యంగా ఉండాలని అఖిల్ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-03-04T20:37:07+05:30 IST