ఏరోస్సేస్‌ పార్క్‌ను సందర్శించిన యూకే జర్నలిస్టుల బృందం

ABN , First Publish Date - 2020-02-08T01:17:13+05:30 IST

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందిన ఎడిటర్లు, జర్నలిస్టుల బృందం శుక్రవారం ఏరోస్పేస్‌ పార్క్‌ను సందర్శించింది.

ఏరోస్సేస్‌ పార్క్‌ను సందర్శించిన యూకే జర్నలిస్టుల బృందం

 యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందిన ఎడిటర్లు, జర్నలిస్టుల బృందం శుక్రవారం ఏరోస్పేస్‌ పార్క్‌ను సందర్శించింది. విమానాల విడిభాగాల అమరిక, మరమ్మతులు, నిర్వహణ సామగ్రిని పరిశీలించింది. పార్క్‌లోని ఎయిర్‌స్పేస్‌ విశేషాలను జిఎంఆర్‌ సంస్ధకు చెందిన అధికారి సౌరభ్‌జైన్‌ వివరించారు. అంతకు ముందు ఈ బృందం గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బి)ని కూడా జర్నలిస్టుల బృందం సందర్శించింది. స్కూల్‌ అకాడ మిక్‌ విశేషాలు, నియామక ప్రక్రియ, విద్యార్ధులకు అందిస్తున్నసేవలు, బిజినెస్‌ రంగంలో స్కూల్‌ ప్రాధాన్యతను సంబంధిత ఐఎస్‌బి ప్రతినిధి జర్నలిస్టులకు వివరించారు. అనంతరం టాటా కన్సల్టెన్సీసర్వీసెస్‌ (టీసిఎస్‌) సినర్జీ పార్క్‌ను కూడా వారు సందర్శించారు. ఐటి రంగంలో టీసిఎస్‌ కృషి, నియామకాలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఐటి సేవల గురించి టీసీఎస్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ రాజు వివరించారు. తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ గోపాల్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌శ్రీనివాస్‌, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు కుమార్‌, సుధాంశ్‌కుమార్‌, సమాచార పౌరసంబంధాల శాఖ బాజ్‌పాయ్‌, యూకేకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఎడిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో మూడు రోజు  లపర్యటన అనంతరం శుక్రవారం వారు తిరిగి ఢిల్లీకి వెళ్లింది. 


Updated Date - 2020-02-08T01:17:13+05:30 IST