సకల సద్గుణవంతుడు శ్రీరాముడు

ABN , First Publish Date - 2020-09-05T09:08:39+05:30 IST

‘సకల సద్గుణవంతుడు శ్రీరామచంద్రుడు. తరతమ బేధాలు లేకుండా, వర్గ వైషమ్యాలకు తావివ్వకుండా పరిపాలన సాగించాడు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. భద్రాద్రి రామాలయంలో కైంకర్యాలన్నీ

సకల సద్గుణవంతుడు శ్రీరాముడు

  • భద్రాద్రిలో అంతా సంప్రదాయబద్ధమే..
  • శార్వరీ ముగింపు వరకూ కరోనా
  • రామయ్య సన్నిధిలో చినజీయర్‌, అహోబిల రామానుజ జీయర్‌

భద్రాచలం, సెప్టెంబరు 4: ‘సకల సద్గుణవంతుడు శ్రీరామచంద్రుడు. తరతమ బేధాలు లేకుండా, వర్గ వైషమ్యాలకు తావివ్వకుండా పరిపాలన సాగించాడు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. భద్రాద్రి రామాలయంలో కైంకర్యాలన్నీ సంప్రదాయబద్ధంగానే చేస్తున్నారు. నియమాలు, నిబంధనలనేవి ఒకరు చెరిపితే చెరిగేవి.. కదిపితే కదిలేవి కావు. ఎవరి సంప్రదాయం వారిది. ఇతరులు దానిని గౌరవించాలి’ అని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. భద్రాచలంలో చాతుర్మాస వ్రత దీక్ష ముగింపు సందర్భంగా అహోబిల రామానుజ జీయర్‌స్వామితో కలిసి రామయ్యను ఆయన దర్శించుకున్నారు. వేగవంతమైన జీవనానికి కరోనా కనువిప్పు కలిగించిందని చినజీయర్‌ అన్నారు.


శుచీ, శుభ్రతలకు పూర్వకాలంలో ఏ రీతిన ప్రాధాన్యమిచ్చారో.. మళ్లీ ఆ రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. అమెరికాలో వ్యాక్సిన్‌ కనుగొన్నారని.. నవంబరు 1న విడుదల చేస్తారని ప్రకటనలు వినవస్తున్నా.. శార్వరీ నామ సంవత్సర ముగింపు వరకూ కరోనా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. సృష్టిని కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. నిజ అశ్వయుజ పునర్వసు నుంచి కార్తీక పునర్వసు వరకు.. 27 రోజులపాటు శ్రీరామాయణ పారాయణ క్రతువును నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-09-05T09:08:39+05:30 IST