ఆడిక్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-01T22:01:33+05:30 IST

ఆడిక్‌మెట్‌ డివిజన్‌లో వివాదం చెలరేగింది. టీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది,

ఆడిక్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్ఎస్- కాంగ్రెస్  నాయకుల ఘర్షణ

హైదరాబాద్‌:  ఆడిక్‌మెట్‌ డివిజన్‌లో వివాదం చెలరేగింది. టీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డివిజన్‌లో మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ నేతలున్నారని.. బయటి ప్రాంతాలవారు నగరంలో ఉండొద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు కావడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్ ఆరోపించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని  చెప్పారు.

Updated Date - 2020-12-01T22:01:33+05:30 IST